రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి: కార్తీక మాస మూడవ సోమవారం సందర్భంగా భువనగిరి పచ్చల కట్ట సోమేశ్వర స్వామి ఆలయంలో పొద్దున స్వామివారికి ఆలయ ప్రధాన పూజారి కప్పగంతుల నాగరాజ్ శర్మ ఆలయ చైర్మన్ కాలేరు లక్ష్మణ్ రావు గారి ఆధ్వర్యంలో స్వామివారికి మహాన్యాస రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించడం జరిగింది అనంతరం భక్తులు అభిషేకాలు అనంతరం స్వామివారికి కార్తీకమాస అన్న పూజ కార్యక్రమం తదుపరి మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ అన్నదాన కార్యక్రమానికి భువనగిరి పట్టణ సి ఐ సుధాకర్ గారు అలాగే పట్టణ కౌన్సిలర్ దిడ్డికడి భరత్ ప్రారంభించడం జరిగింది అలాగే కార్తీక మాసం ప్రదోషకాలంలో పితృదేవతలకు ధ్వజస్తంభ ఆకాశదీపం ఈ నెల రోజులు పెట్టడం జరుగుతుంది అలాగే కార్తీక మాసం రోజు నిత్య అన్నదానం అయ్యప్ప స్వాములకు భక్తులకు నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు బండారి స్వప్న పచ్చ లోడి సురేష్ చంద్ రవీందర్ మోహన్ గౌడ్, ఆలయ పూజారులు కప్పగంతుల నవీన్ శర్మ పుట్టపాక భీష్మ , కైరం కొండ శశి, కొల్లూరి రాజు భక్తులు తదితరులు పాల్గొన్నారు.