రాయల్ పోస్ట్ న్యూస్,
రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేశారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్‌లో మాజీ మంత్రి పట్నం మహేందర్‌ రెడ్డి, శంభీపూర్‌ రాజు నామినేషన్‌ దాఖలు చేశారు.ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్‌, ప్రకాశ్‌ గౌడ్‌ పాల్గొన్నారు. జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
కాగా, ఇవాళ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక ప్రకటన వెలువడనుంది. మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల గడువు ముగుస్తున్నది. ఆరు స్థానాలకు బరిలో ఆరుగురు అభ్యర్థులు ఉన్నారు. దీంతో ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించనున్నారు.