రాయల్ పోస్ట్ న్యూస్ ఎల్బీనగర్ హైదరబాద్ :టిడిపి అధినేత నారా చంద్రబాబు కుటుంబంపై వైసిపి నాయకులు చేసిన అనుచిత వాక్యాలకు నిరసనగా వనస్థలిపురం నందమూరి అభిమాన సంఘం ఆధ్వర్యంలో వనస్థలిపురంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టి హైవే రహదారిపై ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిష్టిబొమ్మను దహనం చేసి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీడీపీ నాయకుల పై మాట్లాడేటప్పుడు నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడితే పార్టీలకతీతంగా ఖండించాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు. కనీసం జ్ఞానం లేకుండా వైసిపి నాయకులు అసెంబ్లీ మాట్లాడడం సిగ్గుచేటుగా ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో నందమూరి అభిమానులు శ్రీనివాసరావు,వెళగం చంద్రశేఖర్, గద్దె విజేత నేత మాహిళ నాయకులు,అభిమానులు,తదితరులు పాల్గొన్నారు.