మోత్కూర్ మండల కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయం ప్రారంభం.
మోత్కూర్ మండల కేంద్రంలో బహుజన సమాజ్ పార్టీ కార్యాలయాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా ఇంచార్జ్ కొండమడుగు రాజు ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి తుంగతుర్తి నియోజకవర్గం ఉపాధ్యక్షులు కె బి రాజు గారు అధ్యక్షత వహించగా జిల్లా ఇన్చార్జి కొండమడుగు రాజు మాట్లాడుతూ బహుజనులకు రాజ్యాధికారం దక్కాలని మాన్యశ్రీ కాన్షీరామ్ సార్ బహుజన సమాజ్ పార్టీ ని స్థాపించారు. 85% ఉన్న బహుజనులు అంధకారంలో ఉన్నారని15 శాతం ఉన్న అగ్రవర్ణాలకు దోపిడీకి గురి అవుతున్నారని బహుజనులు ఓటు ద్వారా రాజ్యాధికారాన్ని సాధించాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో యాదాద్రి జిల్లా అధ్యక్షుడు ఉప్పల జహంగీర్ , జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ అనిల్ , మోత్కూర్ మండల ఇన్చార్జి ఎర్రవెల్లి నాగేశ్వర్ అడ్డగూడూర్ మండల కన్వీనర్ బొడ రవీందర్ , గుండాల మండల కన్వీనర్ గడ్డం శ్రీకాంత్ , శాలి గౌరారం మండల ప్రధాన కార్యదర్శి కారు పార్టీ అంబేద్కర్ , ఉడుగు కిరణ్, మో త్కూరు మున్సిపాలిటీ అధ్యక్షులు గణపాక నవీన్ , మోత్కూర్ మండల కన్వీనర్ ప్రతాప్, మోత్కూర్ మండల నాయకులు బుషిపాక నాగరాజు,గజ్జేలి మహేష్ ,చిప్పలపల్లి ఆనంద్ ,ముక్కెర్ల ప్రశాంత్, ఎర్రవెల్లి సైదులు తదితరులు పాల్గొన్నారు