రైతుల పట్ల మీరు చూపిస్తున్న ఔదార్యానికి మీకు ధన్యవాదాలు, అభినందనలు గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు.

రాయల్ పోస్ట్ న్యూస్ హైదరబాద్ :తెలంగాణ రాష్ట్రంలో సమాచార శాఖ నిబంధనలతో

గత మూడు సంవత్సరాల నుండి ప్రతిరోజూ పత్రికలు తీస్తూ కమిషనర్ కార్యాలయంలో పత్రికలు వేస్తూ ఏదో ఒకరోజు ప్రకటనలు వస్తాయని ఎదురుచూస్తూ లక్షలాది రూపాయలు అప్పులు చేసి
పత్రికలు తీస్తూ మానసిక ఒత్తిడితో ఇప్పటికే అనేకమంది చచ్చిపోయి మిగతా పత్రికల ఎడిటర్లు
జీవచ్చవాల్లా బతుకుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో
విలేకరులుగా పనిచేస్తున్నవారు, అర్ధాకలితో బ్రతుకులీడుస్తున్నారు.కొంతమంది ఈ మధ్య ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రాంతీయ పత్రికలకు ప్రకటనలు ఇచ్చి ఆదుకోండి. అన్ని పత్రికలకు, ఛానల్లకు వివక్ష చూపకుండా ప్రకటనలు ఇవ్వండి. అర్ధాకలితో బ్రతుకులీడుస్తున్న జర్నలిస్టుల గురించి కూడా ఆలోచించండి. పెద్దలు ఇంటగెలిచి రచ్చ గెలువాలంటారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన ప్రాంతీయ పత్రికలను ఆదుకోవాలని,
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి.
ఈ మధ్యకాలంలో చనిపోయిన దాదాపు 150 మంది(కరోనాతో, మానసిక ఒత్తిడితో, రోడ్డు ప్రమాదాల్లో, ఆత్మహత్య చేసుకున్న) జర్నలిస్టుల కుటుంబాలకు డబుల్ బెడ్రూం ఇళ్ళు లేదా ఇళ్ల స్థలాలు ఇచ్చి ఆదుకోండి