రాయల్ పోస్ట్ న్యూస్ యాదాద్రి భువనగిరి: ప్రపంచ మత్య్సకారుల దినోత్సవం సందర్భంగా జిల్లా మత్స్య శాఖ కార్యాలయంలో జిల్లా మత్య్స శాఖ అధికారులు యం. రాజారాం గారి ఆధ్వర్యంలో జిల్లాలోని జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ, గంగపుత్ర సంఘ కార్యదర్శి సత్యనారాయణ, భువనగిరి అధ్యక్షులు నర్సింగరావు, జలాల్పూర్ అధ్యక్షులు మారయ్య , జైనపల్లి అధ్యక్షులు ప్రేమ్ చంద్, పహిల్వాన్ పూర్ అధ్యక్షులు స్వామి, చిన్నారావులపల్లి కిషన్ మరియు వివిధ మత్య్స కార్మిక సంఘాల అధ్యక్షులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 1997లో ఢిల్లీ వేదికగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మత్స్యకారులు , వ్యాపారస్తులు సమావేశమై మత్య్స సంపదపై సుదీర్ఘంగా చర్చించారు.ఈ సందర్భంగా భవిష్యతు తరానికి సముద్ర వనరులను అందించాలని నిర్ణయించారు, ప్రపంచమంతా మత్య్స సంపదను ప్రతి సంవత్సరం 10 కోట్ల మెట్రిక్ టన్నుల చేపలను ఆహారంగా వాడుతున్నారు. చేపల వేటపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారు, ఏటా 40 కోట్లకు పైబడి విలువైన చేపలను ఎగుమతి చేస్తున్నారు.ఇంతటి ప్రాధాన్యత ఉన్న మత్స్య సంపద పర్యావరణ కాలుష్యం భూతాపం వంటి కారణాల వల్ల రోజురోజుకు నశించిపోతుంది. మర బోట్లు , యాంత్రీకరణ వల్ల మత్స్య సంపద నానాటికీ తరిగి పోతున్నది. సముద్రాలు, నదులలోని జల సంపద పూర్తిగా అంతరించిపోకుండా పటిష్టమైన చర్యలను తీసుకొనుట ద్వారా సుస్థిర చేపల అభివృద్ధికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మేధావులు పేర్కొంటున్నారు. కిసాన్ క్రెడిట్ కార్డ్ గురించి చర్చించడం జరిగింది , జిల్లాలో ఎటువంటి సమస్యలు ఉన్నా వాటిని త్వరగా పరిష్కరిస్తామని జిల్లా మత్స్యశాఖ అధికారి తెలపడం జరిగింది , ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్య శాఖ కార్యాలయ సిబ్బంది ఫీల్డ్ మాన్ రవి, ఫిషరీస్ అసిస్టెంట్ సాయి చరణ్, ఫిషెర్మెన్ నరేష్, సయ్యద్, సునీల్, సలీమ్ పాల్గొన్నారు.