రాయల్ పోస్ట్ తెలుగు దిన పత్రిక యాదాద్రి భువనగిరి జిల్లా :
భువనగిరి పట్టణంలోని స్థానిక విశ్రాంతి ఉద్యోగుల భవనంలో తెలంగాణ కళా, వృత్తి వ్యాయామ ఉపాధ్యాయుల జిల్లా సన్నాహక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
ఈ సమావేశంలో పలు మండలాల సంబంధించిన పిటిఐ లు పాల్గొన్నారు.
జిల్లా అధ్యక్షురాలిగా బిట్ల అరుణం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు .
అనంతరం వారు మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా లోని పిటిఐ ఉపాధ్యాయుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తారని ప్రభుత్వానికి చేరే విధంగా కృషి చేస్తానని కరోన కాలంలో పి టి లు అనేక ఇబ్బందులు పడ్డారని మరియు చాలీచాలని జీతాలతో జీవనం కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సమాన పనికి సమాన వేతనం కల్పించాలని కోరారు.
జిల్లా ఉపాధ్యక్షులుగా భూపతి నరసయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి జి రేణుక, జిల్లా సహాయ కార్యదర్శిగా ఉమారాణి ,కోశాధికారిగా కిరణ్ మరియు జిల్లా కార్యవర్గ సభ్యులుగా విజయలక్ష్మి, బి.వసంత ,మమత, రేణుక ,మహేష్, కృష్ణవేణి ఎన్నుకోవడం జరిగింది .
ఈ కార్యక్రమంలో వివిధ మండల PTIలు అనిత,రేణుక ,రహిమున్నిసా జమ్మయ్య రేణుక శ్యామల సునీత తదితరులు పాల్గొన్నారు.