ఘనంగా కార్తీక మాస ఆర్యవైశ్య వన భోజనోత్సవం

నేషనలిస్ట్ వాయిస్ (ఎల్బీనగర్)

రాయల్ పోస్ట్ న్యూస్ ఎల్బీనగర్ : వనస్థలిపురంలో ఆర్య వైశ్య సంక్షేమ సంఘం ద్వారకమై నగర్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు బాలకృష్ణ గుప్తా ఇతర సంఘ సభ్యులతో కలిసి కార్తీక మాస వన భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ప్రతి కార్తీక మాస సమయంలో వన భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు.అందరూ ఒకే దగ్గర కలిసి వన భోజనం చేయడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని సభ్యులు తెలిపారు.
గతంలో కరోనా కారణంగా ఈ కార్యక్రమాన్ని చేయలేకపోయామని అన్నారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బాల కృష్ణ గుప్తా,ఉపాధ్యక్షుడు మురళి గుప్తా,శ్రీధర్ గుప్తా,శ్రీశైలం గుప్తా,వెంకటేశ్వర్లు గుప్తా,సుధాకర్,గణేష్ కుమార్ గుప్తా,జగన్నాద్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.