రాయల్ పోస్ట్ న్యూస్ రాజేంద్రనగర్ : రాజేంద్రనగర్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న బుద్వేల్ గ్రామంలోని రోడ్లపై ఎక్కడ చూసినా చెత్త చెదారం దర్శనమిస్తున్నాయి.సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.స్థానికంగా ఉన్న సమస్యలను రాజేంద్రనగర్ డివిజన్ కార్పొరేటర్ పొడవు అర్చన జయప్రకాష్ దృష్టికి తీసుకెళడానికి పలుమార్లు ఫోన్ చేసినా స్పందన కరువైందని స్ధానికులు అంటున్నారు. పరిధిలోని మెథడిస్ట్ చర్చ్ ఎస్.బీ.ఐ మరియు యాక్సిస్ బ్యాంక్ ఎటిఎం పరిసరాల్లో అలాగే రాజేంద్రనగర్ పోలీస్ క్వార్టర్స్ సమీపంలో రోడ్డుపై ఎక్కడికక్కడ చెత్త నిల్వలు దర్శనమిస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వృద్ధులు చిన్నారులు వ్యాధులు భారీన పడుతున్నారని అంటున్నారు.ఇకనైనా ప్రజాప్రతినిధులు తమ మొర విని చెత్తను ప్రతిరోజు తొలగించడానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ప్రధానరహదారిలో రాకపోకలకు ఆటంకం కలిగిస్తున్న
మ్యాన్ హూల్ …. ప్రధాన రహదారిపై ఉన్న మ్యాన్ హుల్ పగిలి రాకపోకలకు ఆటంకం కలుగుతుందని స్థానికులు అంటున్నారు.గత నాలుగు నెలలుగా సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వగా కాలయాపన చేస్తూన్నారని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. మ్యాన్ హుల్ కవర్ పగిలి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇప్పటికైనా మ్యాన్ హూల్ ను బాగుచేయలని అధికారులను ప్రజాప్రతినిధులను కోరుతున్నారు.