రాయల్ పోస్ట్ న్యూస్ నగొండ :ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ముదిరాజ్ మత్స్యకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకనబోయిన రమణ ముదిరాజ్ ఆధ్వర్యంలో నల్లగొండలోని వల్లభరావ్ చెరువు దగ్గర ముదిరాజ్ మత్స్య సొసైటీల పితామహుడు కీర్తిశేషులు నర్సింలు నాయుడు గారిని యాది చేసుకుంటూ సహకరిస్తున్న వారి శిశ్వుడు అడ్వొకేట్ డీ ఎల్, పాండు కు, హైకోర్టు లాయర్ కుడుముల శ్రీనివాస్ లకు కృతజ్ఞతలు తెలియచేస్తూ కార్యక్రమం ప్రారంభించడంచడం జరిగింది, ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు లోకనబోయిన రమణ ముదిరాజ్ మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల మత్స్యకారులకు మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ఉచిత చేప పిల్లల పథకంలో దళారీ వ్యవస్థ వల్ల మత్స్యకారులకు మేలు జరగకపోగా ప్రభుత్వ ఖజానాకు చిల్లు పడుతుందని కావున దళారీ వ్యవస్థను రద్దు చేసి మత్స్యకార కులాలకు చెందిన యువతీ యువకులచే చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు నెలకొల్పి వాటి ద్వారా చెరువులు కుంటలకు నాణ్యమైన చేప పిల్లలను అందించాలని దీనివల్ల తెలంగాణ రాష్ట్రం మత్స్య అభివృద్ధి లో అగ్ర స్థానం చేరుతుందని మరియు తెలంగాణలోని నిరుద్యోగులకు కూడా ఉపాధి కల్పించిన వారవుతారని తెలియజేశారు

రాష్ట్రంలో 50 సంవత్సరాలు నిండిన మత్స్యకారులకు వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి నైపుణ్య పరీక్ష లేకుండా మీ సేవ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి చెరువు విస్తీర్ణంతో సంబంధం లేకుండా సభ్యత్వం కల్పించాలని విజ్ఞప్తి చేశారు, నూతన చెరువు సొసైటీలు మత్స్య మహిళా సొసైటీ లు ఏర్పాటు చేయడానికి ఎన్నో ప్రతిబంధకాలు ఆంక్షలు నానా రకాల పనికిమాలిన నిబంధనలు ఉన్నాయని కావున వాటిని ఎత్తివేసి ప్రక్షాళన చేసి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సరళతరం చేయాలని ప్రభుత్వాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని కమిషనర్ గారికి కోరుతున్నామన్నారు, ఇట్టి కార్యక్రమంలో మాటూరి శ్రీనివాస్ ముదిరాజ్, బొమ్మకంటి లింగస్వామి, మాటూరి నాగరాజు, శివ, లక శ్రీనివాస్, కొరివి సైదులు, గుడిశె శివ, సింగం శ్రీనివాస్, సింగం నరసింహ,గణేష్ లక్ష్మీకాంత్ తదితరులు పాల్గొన్నారు