మేడ్చల్ జిల్లా,(రాయల్ పోస్ట్ న్యూస్ ): నవంబర్ 21 మేడిపల్లి అంబేద్కర్ ఆశయ సాధన సంఘం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాల అలంకరణ చేసి ఆయన చేసిన త్యాగాలను స్మరించుకునే కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ ఆదివారం 144వ వారంగా చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అంబేద్కర్ ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షులు నత్తి మైసయ్య గారు పాల్గొని మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ తన జీవితం మొత్తాన్ని త్యాగం చేసినాడు అని నేడు ఆ జాతులు అంబేద్కర్ ఆశించిన నవ సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చాడు దేశ జనాభాలో 80 శాతం ఉన్న బహుజనులు స్వార్థ రాజకీయ నాయకుల వలలో పడకుండా బహుజనుల అభ్యున్నతి కోసం మనం అందరం ఐక్యంగా ఉండి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు ఈరోజు అంబేద్కర్ విగ్రహానికి బోడుప్పల్ ఎలక్ట్రాన్ మీడియా నాయకులు కోతి మహేష్ గౌడ్,చంద్రశేఖర్,ఏర్పుల కుమార్,దొంతు స్టాలిన్,జ్ఞాన మాలను వేయడం జరిగింది తెలంగాణ బహుజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్రఅధ్యక్షులు ఇటికాల రవీందర్ మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం లో ప్రాథమిక హక్కుల ద్వారా కల్పించిన అనేక హక్కుల ద్వారా మన అభిప్రాయాలను మన సమస్యలను స్వేచ్ఛగా చెప్పుకునే అవకాశం లభించిందని అది రాజ్యాంగం ద్వారా మనకు లభించిన గొప్ప అవకాశం గా భావించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మందుల సూర్య కిరణ్ కామ గొల్ల బాబు దాసు రాజేష్ బండారి సాయి ఈతకోట గోపాలకృష్ణబొల్లం శశి కుమార్. అజయ్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.