రాయల్ పోస్ట్ న్యూస్ హైదరాబాద్‌ : తెదేపా అధినేత చంద్రబాబు కుటుంబంపై వైకాపా నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలపై నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించారు. ఆయన నివాసంలో కుటుంబసభ్యులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.

‘ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలు చాలా బాధాకరం. సజావుగా సాగాల్సిన అసెంబ్లీ వ్యక్తిగత దూషణలకు వేదికైంది. అభివృద్ధిపై చర్చకు బదులు వ్యక్తిగత అజెండాను తీసుకొచ్చారు. చంద్రబాబు చాలా ధైర్యంగా ఉండే మనిషి. ఎప్పుడూ ఆయన కంటతడి పెట్టలేదు. అసెంబ్లీలో సవాళ్లు, ప్రతి సవాళ్లు ఆనవాయితే. అయితే కుటుంబ సభ్యులపై దాడి సరికాదు. మేం వ్యక్తిగతంగా ఎప్పుడూ ఎవరిని విమర్శించలేదు. మా సోదరిపై వ్యక్తిగత విమర్శలు చేయడం బాగాలేదు’ అని బాలకృష్ణ అన్నారు.