రాయల్ పోస్ట్ న్యూస్ నిజామాబాద్ జిల్లా: ఆర్మూర్ పట్టణంలో పెర్కిట్ గ్రామంలో ఈ పాప ఇప్పుడే పెర్కిట్ శివారులోని హనుమాన్ టెంపుల్ దగ్గరలో బస్సు ప్రమాదం నుంచి కాపాడి అటు నుంచి వెళుతున్న యువకులు చూసి మానవతా దృక్పథంతో పాపను దగ్గరకు తీసుకొని వివరాలు అడగగా తల్లి పేరు భూమి అని చెబుతోంది. తండ్రి పేరు చెప్పట్లేదు దీనితో యువకులకు ఒక మంచి ఆలోచన కలిగింది. ఆ ఆలోచన పాపను తీసుకుని 10 నిమిషాల్లో ఆర్మూర్ పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. డ్యూటీలో ఉన్న ఎస్ఐకి అప్పగించారు. ఆర్మూర్ ఎస్ఐ వివరాలు తెలుసుకొని రెండు గంటలలో ఈ పాపని తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. మానవతా దృక్పథం చాటుకున్న సుబ్బి రియల్ గ్రామవాసి అయిన మహేష్ మరియు మంతిని కోటగిరి శ్రీనివాస్ కు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఎప్పటికీ మేలు మర్చిపోమని అన్నారు. అలాగే సంబంధిత ఆర్మూర్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి ఎస్ఐకి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.