రాయల్ పోస్ట్ న్యూస్ నల్గొండ జిల్లా:అవినీతి మయమైన ఉచితచేప పిల్లల పంపిణి, రాజుల సొమ్ము రాళ్ళ పాలు, ప్రభుత్వ సొమ్ము దళారులు లంచగొండ్ల పాలు, సొమ్ము ఒకడిది సోకు ఒకడిది, మత్స్య సొసైటీలకు చెరువుల్లో పొస్తున్నది చేప పిల్లలు కాదు ఆంధ్రా నుండి డ్రమ్ముల్లో తెస్తున్న నీళ్లు, సిగ్గు సిగ్గు
(లోకనబోయిన రమణ ముదిరాజ్)

రేపు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకనబోయిన రమణ ముదిరాజ్ నల్లగొండ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మీడియా ముఖంగా మత్స్యకారులకు శుభాకాంక్షలు తెలియచేసారు,
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం నూటికి తొంభై శాతం ఫెయిల్ అని, కర్ణుడి చావుకు సవా లక్ష శాపాలన్నట్టు మంత్రి పేషీ నుండి మొదలైన పర్సన్టేజీలు క్రింద క్షేత్ర స్థాయి వరకు లంచగొండి తనం రాజ్యమేలడం, కాంట్రాక్టర్లకు స్వలాభమే తప్ప మత్స్యకారులకు మేలు చేయాలన్న తలంపు లేకపోవడమే పధకం నీరు కారిపోవడానికి కారణాలంటూ అవకతవకలకు పాల్పడిన కాంట్రాక్టర్లకు బిల్లులు రాకుండా అడ్డుకుంటామన్నారు

ఇక మత్స్య సొసైటీల పరంగా చూస్తే చెరువు దగ్గరకు వచ్చిన చేప పిల్లల్లో అవకతవకలున్నా రిటర్న్ చేయకుండా సచ్చినోడి పెండ్లికి వచ్చిందే కట్నమన్నట్లుగా చెరువుల్లో పోయించుకోవడమని, ఇలాంటి అన్యాయాలను ఎదుర్కోవాలంటే ముఖ్యంగా మత్స్య సొసైటీ పాలకమండలులే ఎక్కువ బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు, ప్రభుత్వం చెరువులు కుంటలకు కేటాయిస్తున్న చేప పిల్లల సంఖ్య ఎంత అనేది ముందుగా చెరువు దగ్గరకు చేప పిల్లలు పంపిణీ చేయడానికి వచ్చిన బాద్యుల దగ్గర నుంచి సమాచారం తీసుకోని దగ్గరుండి చేప పిల్లల సైజు స్కేలుతో కొలుచుకోని ఓపికతో 1,సైజు, 2,నాణ్యత, 3,సంఖ్య ఈ మూడు కరెక్ట్ గా ఉన్నాయని ధ్రువీకరించుకున్న తర్వాతనే పేపర్ల మీద సంతకాలు పెట్టాలని, ఒకవేళ ఈ మూడింట్లో ఏది తక్కువున్నా వీడియోలు తీసి కార్యాలయ సిబ్బందిని సంబంధిత కాంట్రాక్టర్ ను నిలదీసి అట్టి వాహనాలను వెనక్కి పంపి వారి పైన అధికారులకు,టీ ఆర్ ఎమ్మెస్ కు పిర్యాదు చేయాలన్నారు,ముఖ్యంగా చెరువు సొసైటీ అధ్యక్షులు డైరెక్టర్లు ఎవరి ప్రలోభాలకు లోను కాకుండా నమ్మకంతో ఎన్నుకున్న మత్స్య సొసైటీ సభ్యులకు నష్టం జరగకుండా చూసుకోవాల్సిన పూర్తి బాధ్యత పాలకమండలిలో ఉన్న వారిపై ఉంటుందని కావునా అవగాహన పెంపొందించుకోని ఐక్యమత్యంతో మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి నిస్వార్థంగా కష్టపడి పని చేయాలని విజ్ఞప్తి చేశారు
ఏ పాలకమండలి అయితే మత్స్యకారులకు న్యాయం చేయధో టీ ఆర్ ఎమ్మెస్ దృష్టికి తీసుకురావాలని మరియూ అలాంటి వారిని నిర్దాక్షిణ్యంగా నిర్భయంగా సొసైటీ ఎన్నికల్లో దూరం పెట్టాలని కోరుతున్నామన్నారు