రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి : ప్రజా రవాణా సంస్థ ఆర్టీసీ ని ప్రైవేటుపరం చేయకుండా ఆపాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు గోరేటి రాములు, MD. ఇమ్రాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈరోజు AITUC తెలంగాణ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు లో భాగంగా ఆర్టీసీ సంస్థ పరిరక్షణకై యాదగిరిగుట్ట బస్టాండ్ లో కరపత్రాలు పంచుతూ ప్రచారం నిర్వహించి ప్రయాణికులు, సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మునిసిపల్ కో-ఆప్షన్ సభ్యులు పెరబోయిన పెంటయ్య,AITUC జిల్లా ఉపాధ్యక్షులు గొరిగే నరసింహ, నాయకులు పొన్నాల రాములు,గోపగాని రాజు,మురారి శంకర్, కంబాల సాయిమల్లు తదితరులు పాల్గొన్నారు.