రాయల్ పోస్ట్ న్యూస్ రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం:
నూతన విద్యా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని అంగన్వాడీ టీచర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి జి.కవిత డిమాండ్ చేశారు. గండిపేట మండలం అన్నారం సంగి లో శనివారం అంగన్వాడీ టీచర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ సెంటర్లలో ఎత్తివేయడం కోసం కుట్ర చేస్తున్నాయని విమర్శించారు. నూతన విద్యా విధానం ప్రకారం అంగన్వాడీ కేంద్రాలను ప్రైమరీ స్కూల్స్ లో కలిపేందుకు ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నారు. తద్వారా అంగన్వాడీ కేంద్రాలను ఎత్తివేయాలని చూస్తున్నారని విమర్శించారు. అందుకోసమే అంగన్వాడీ సెంటర్లకు శాశ్వత భవనాలు కట్టడం లేదని, వసతులు కల్పించడం లేదని అన్నారు. పేద మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండి, చిన్న వయసులో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న అంగన్వాడీ సెంటర్లను మోసపూరితమైన పేరుతో ఎత్తివేయడం కోసం ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి అన్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో ఈనెల 25వ సిడిపిఓ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం అన్ని జిల్లాల్లో జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, వర్కర్లు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు గండిపేట మండల కన్వీనర్ రుద్ర కుమార్, నార్సింగి కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఉషారాణి, అంగన్వాడీ టీచర్లు ఆయాలు పాల్గొన్నారు.