దుర్గమ్మ దేవాలయం భూమి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

రాయల్ పోస్ట్ న్యూస్ పటాన్ చేరువు: అమీన్పూర్ మండలం పటేల్ గూడ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ శ్రీ దుర్గమ్మ దేవాలయం భూమి పూజ కార్యక్రమంలో పటాన్చెరువు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మానసిక ప్రశాంతతకు దేవాలయాలు నిలయాలనీ అన్నారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, ఎంపీపీ దేవానందం, గ్రామ సర్పంచ్ నితీష శ్రీకాంత్, గ్రామ పుర ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.