• రాయల్ పోస్ట్ న్యూస్ కరీంనగర్ :తెలంగాణ రాష్ట్రంలో పెట్రోలు ఉత్పత్తులపై పన్ను రాబడి పొంది వ్యాట్ ను ఎందుకు తగ్గించడం లేదో టిఆర్ఎస్ ప్రభుత్వం స్పష్టం చేయాలని , రాష్ట్రంలో వ్యాట్‌ను తగ్గించాలని,కెసిఆర్ ప్రభుత్వానికి దమ్ముంటే
    పెట్రోలు ఉత్పత్తుల పన్నులపై కేంద్ర ప్రభుత్వ వాటా, రాష్ట్ర లెక్కలు సైతం బహిర్గతం చేయాలని మాజీశాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ & డీజిల్ పై VAT ను  వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ జిల్లా అధ్యక్షుడు గంగా డి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో శనివారం కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్‌లో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి హాజరైన ఆయనమాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో పెట్రోల్ అంశంపై వాస్తవాలను కప్పిపుచ్చి తప్పుడు ప్రకటనలు చేశారని , టిఆర్ఎస్ ప్రభుత్వానికి దమ్ముంటే పెట్రోలు ఉత్పత్తుల వాటాల పై వాస్తవ లెక్కలను ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. పెట్రోల్ పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటాల్లో అత్యధికంగా లబ్ధి పొందుతుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పారు . పెట్రోల్ పై కేంద్ర ఎక్సైజ్ సుంకం ,పన్నురూ.32.90 ఉండగా, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ 27. 56 ఉందని, డీజిల్ పై కేంద్ర వాటా రూ.31.80 కాగా, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ21.67 ఉందని వివరించారు . ఆయా పెట్రోల్ ఉత్పత్తుల పన్ను రాబడి పై కేంద్రం రాష్ట్రాలకు తిరిగి చెల్లించే పన్నులు 30 శాతం ఉండగా ప్రధాని మోడీ 42 శాతానికి పెంచారని, దీంతో పెట్రోల్ ఉత్పత్తుల పన్నుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకి మేలు జరిగి, అధికంగా లబ్ధి పొందుతున్నారని తెలిపారు. దీంతో పెట్రోలు పన్నులపై కేంద్ర ప్రభుత్వానికి లభించేది కేవలం 19 రూపాయలు మాత్రమేనని, రాష్ట్రాలకు రూపాయలు 41.50 లభించి అత్యధికంగా రాష్ట్రాలే లబ్ధి పొందుతున్నారని చెప్పారు. పై విషయాలన్నీ వాస్తవాలు అయితే , ఇట్టి విషయాలను కప్పిపుచ్చిముఖ్యమంత్రి కేసీఆర్ తప్పుడు ప్రకటనలు చేయడం సిగ్గుచేటన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలను అదుపులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం తన వంతు గా పెట్రోల్‌పై ఐదు రూపాయలు, డీజిల్ పై పది రూపాయలు తగ్గించిందని, దేశంలోని చాలా రాష్ట్రాలు కూడా ధరలను అదుపులోఉంచడానికి చర్యలు చేపట్టి వ్యాట్ తగ్గించుకోవడంతో అనేక రాష్ట్రాల్లో పెట్రోలు , డీజిల్ ధరలు తగ్గి సామాన్యులకు ఊరట లభించిందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి పెట్రోల్ పై పన్నుల రాబడి అత్యధికంగాఉందని , అలాంటప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం వ్యాట్‌ను ఎందుకు తగ్గించుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. ధనిక రాష్ట్రం తెలంగాణలో పెట్రో ధరలను అదుపులోకి తీసుకురావడానికి కెసిఆర్ కు మనసొప్పడం లేదని, అందుకే వ్యాట్‌ను తగ్గించుకో లేక సామాన్య ప్రజానీకాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేసి , ఇట్టి అంశంలో కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకోవడంఅవివేకమన్నారు . నాడు కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వ హయాంలో పెట్రోల్ ఉత్పత్తి సంస్థల దగ్గరచేసిన లక్షల కోట్ల అప్పులు తీర్చుతూ సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు తలెత్తకుండా మోడీ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని తెలిపారు . టిఆర్ఎస్ ప్రభుత్వం పెట్రోల్ ధర అంశంలో అసత్య ప్రచారాలు, ప్రకటనలు చేస్తూ , బిజెపి ప్రభుత్వం పై బురద జల్లె ప్రయత్నం చేస్తుందని ఆయన మండిపడ్డారు . 2014 కు ముందు యూపీఏ హయాంలో అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడ్ ఆయిల్ ధర ఎక్కువగా ఉన్నప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం తమ రాజకీయ అవసరాలు,లక్ష్యాల కోసం పెట్రోల్ డీజిల్ ధరలు తక్కువ రేటుకు అమ్మే ప్రయత్నం చేసిందని, పెట్రోల్ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి నిధులు కూడా వెచ్చించ లేని దుస్థితిలో ఆయిల్ బాండ్ల రూపంలో లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందని ఆయన వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్రోలు ఉత్పత్తులపై చేసిన అప్పులు నేడు ప్రజలకు శాపంగా మారాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పెట్రోల్ దిగుమతులను సాధ్యమైనంతగా తగ్గించుకోవడానికి మోడీ ప్రభుత్వం ర్యాపిడ్ గా ఇథనాల్ ఇంధనాన్ని తయారు చేయిస్తున్నారని, మరోపక్క ఎలక్ట్రిక్ వాహనాలకు భారీ ఎత్తున సబ్సిడీలు , ప్రోత్సాహకాలు అందించి ప్రోత్సహిస్తున్నారని చెప్పారు . కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ తో వచ్చిన పన్నుల రాబడి తో దేశంలో అనేక ప్రయోజనకర కార్యక్రమాలు చేపట్టిందని వివరించారు .రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సిన పనులను కూడా కేంద్ర ప్రభుత్వమే నిర్వహిస్తోందని, కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం సిగ్గులేకుండా పథకాల పేర్లు మార్చి స్టాంపులు వేసుకుంటున్నాయని ఆయన ఎద్దేవా చేశారు . నేడు ప్రజలు పెట్రో ఉత్పత్తుల పెరుగుదలపై ఇబ్బంది పడుతుంటే కేంద్రం తన బాధ్యతగా ధరలను తగ్గిస్తే కనీసం తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం పెట్రోలు ఉత్పత్తులపై పన్నులు కూడా తగ్గించుకునే రీతిలో ఆలోచన చేయకపోవడం దౌర్భాగ్యం అన్నారు .కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల నిధులు వెచ్చించి దేశ రక్షణ కోసం, దేశ ప్రజలందరి సంక్షేమం కోసం, రాష్ట్రాల అభివృద్ధి కోసం ఇన్నిచేస్తున్నప్పుడు , టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఏమి చేస్తున్నట్టు..? అని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వమే దేశంలోని ప్రజలందరి అవసరాల కోసం , దేశ రక్షణ భద్రత కోసం , రాష్ట్రాల అభ్యున్నతికి పని చేస్తు లక్షల కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నప్పుడు ,కనీసం పెట్రోలు ఉత్పత్తులపై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ పన్ను ఎందుకు తగ్గించుకోలేక పోతున్నారో ప్రజలకు స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోలు ఉత్పత్తులపై ప్రతిరోజు పన్నుల రూపేణా కోట్ల రూపాయలు దండు కుంటూ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదన్నారు. దేశ ప్రయోజనాల కోసం , ప్రజల సంక్షేమం కోసం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని అందుకే పెట్రోలు ఉత్పత్తులపై ధరలను తగ్గించారని పేర్కొన్నారు. కెసిఆర్ ఆర్ ప్రభుత్వం పెట్రోలు ధరల పెరుగుదల విషయంలో అసత్య ప్రకటనలు, ప్రచారాలతో తప్పుదారి పట్టించి రాజకీయ ప్రయోజనాలు పొందాలనుకోవడం మూర్ఖత్వమన్నారు .కేసీఆర్ సర్కార్ వెంటనే వ్యాట్‌ను తగ్గించి పెట్రోల్ డీజిల్ ధరలను అదుపు లోకి తీసుకురావాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
    ఈ కార్యక్రమంలో కరీంనగర్ మాజీ మేయర్ డి శంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, కళ్లెం వాసుదేవ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్ రావు, మైనారిటీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి ముజీబ్, దళిత మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు గడ్డం నాగరాజు,మైనారిటీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండి జమాల్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు చొప్పరి జయశ్రీ,దిశ కమిటీ మెంబెర్ జానపట్ల స్వామి, బిజెపి జిల్లా అధికార ప్రతినిధులు బొంతల కళ్యాణ్ చంద్ర, అలివేలు సమ్మిరెడ్డి , గాజె రమేష్, కటకం లోకేష్, మాడుగుల ప్రవీణ్ కుమార్,పుప్పాల రఘు, మైనారిటీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఎండి పర్వేజ్ ,మాడ వెంకటరెడ్డి, నాగసముద్రం ప్రవీణ్, నరహరి లక్ష్మారెడ్డి, సొల్లు అజయ్ వర్మ, నాంపల్లి శ్రీనివాస్, సిద్ది సంపత్ తదితరులు పాల్గొన్నారు.