యస్ కె సుభాన్ రిపోర్టర్ (రాయల్ పోస్ట్ న్యూస్) బెల్లంపల్లి మంచిర్యాల:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్లడం ఖాయమని టిడిపి పార్టీ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు అమనుల్లా ఖాన్ అన్నారు.శనివారం పట్టణంలోని బాబు క్యాంపు ప్రెస్ క్లబ్ లో ఎర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు అతని సతీమణి భువనేశ్వరి పై ఆత్మగౌరవం కించపర్చేలా మాటలు మాట్లాడటం సరైందికాదని మండిపడ్డారు.చంద్రబాబు నాయుడు వెనక ప్రజలందరు ఎల్లవేళలా ఉంటారని,రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు.ప్రజాసేవకే జీవితాన్ని అంకితం చేసిన చంద్రబాబుపై అసత్య ఆరోపణలు చేస్తూ ఆత్మగౌరవం కించపరిచేలా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలు జీవితం గడిపినప్పటికీ బుద్ధి రాకపోవడం సిగ్గు చేటన్నారు.సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నారే తప్ప అభివృద్ధి చేయడం లేదన్నారు.రానున్న ఎన్నికల్లో ప్రజలే వారికి బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.ఈ సమావేశంలో నాయకులు ఎం డిసాదిక్,సత్యనారాయణ,మచ్చయ్య,బుక్రు తదితరులు పాల్గొన్నారు.