రాయల్ పోస్ట్ న్యూస్ రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల నియోజకవర్గం లోని వైయస్సార్ తెలంగాణ పార్టీ రోజు రోజుకు పుంజుకుంటుందని చేవెళ్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కోరని దయానంద్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఇరవై రోజుల నుండి నియోజకవర్గం పరిధిలోని గ్రామాల్లో సమస్యలపై తెలుసుకుంటున్న వేళ పార్టీపై యువకుల్లో వృద్ధుల మంచి మంచి ఆదరణ లభిస్తుందని తెలిపారు. ఈ గ్రామాల్లో పర్యటన సందర్భంగా ముడుమాల గ్రామానికి వెళ్తున్నా సందర్భంగా దారిలో పలు గ్రామాల్లో యువకులు కలిసి రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాటానికి మీకు మద్దతిస్తామని వాళ్ళు సంపూర్ణంగా తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో రమేష్ ,గాంధీ ,మహేందర్ డేవిడ్ ,ప్రశాంత్ తదితరులు పాల్గొనడం జరిగింది.