680 మంది ప్రాణత్యాగం వెన్నుచూపని రైతాంగ పోరాటానికి విజయం..
భారత దేశ వ్యాప్తంగా రైతులు 360 రోజులు నిర్వహించిన విరోచిత పోరాటాలకు,ఉద్యమాలకు, 680 మంది రైతులు చేసిన ప్రాణత్యాగానికి, ఢిల్లీ కేంద్రంగా రైతు వీరులు సాగించిన నిరంతర పోరాటానికి రైతు చట్టాలు రద్దు పెద్ద విజయమని AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి MD. ఇమ్రాన్ అన్నారు.
రైతు పోరాటాల ద్వారా కళ్ళు తెరిచిన కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల విధానాలకు స్వస్తి చెప్పి బ్రిటిష్ కాలం నాటి నుండి పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను యధావిధిగా కొనసాగించి,4 లేబర్ కోడ్ లను కూడా వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా ఇమ్రాన్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.