రాయల్ పోస్ట్ న్యూస్ కరీంనగర్ : కార్తీక పౌర్ణమి సందర్భంగా కరీంనగర్ లోని చైతన్యపురి శ్రీ మహాశక్తి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం శ్రీ మహాదుర్గ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతీ అమ్మవార్లకు అభిషేకం మరియు సామూహిక రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. ఉదయం, సాయంత్రం వేళల్లో కార్తీక దీపాల వెలుగులతో దేవాలయ ప్రాంతం కళకళలాడింది. దేవాలయ ఆవరణలో భక్తులు తమ భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలను వెలిగించి, అమ్మవార్లను దర్శించుకున్నారు. దేవాలయ ప్రాంగణానికి సాయంత్రం వేళలో భక్తులు అధిక సంఖ్యలో వెలిగించిన దీపాలతో ఆలయ ఆవరణ కార్తీక పౌర్ణమి శోభను సంతరించుకుంది. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో దేవాలయానికి తరలివచ్చారు తమ మొక్కులు తీర్చుకున్నారు. డా. గర్రెపల్లి మహేశ్వర శర్మ కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టతను తెలియజేయగా, ఆలయ అర్చకులు కోరిడే శ్రీనివాస్ శర్మ, కొరిడే శ్రీధర్ శర్మ పూజలు నిర్వహించారు.