యస్ కె.సుభాన్ పాషా (రాయల్ పోస్ట్ న్యూస్) బెల్లంపల్లి:వసీమ్ రాజ్వి అనే వ్యక్తి తమ ప్రవక్త మహమ్మద్ పై దృష్ ప్రచారము మరియు అనుచిత వ్యాఖ్యలు చేసాడని మరియు నిందారోపణలు చేసాడని అతనిని వెంటనే శిక్షించాలని బెల్లంపల్లి జామా మసీద్ ఇమామ్, మరియు మస్జిద్ కమిటీ ప్రెసిడెంట్ ఎండి హాజీ, ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షులు ఖలీల్ లు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఈరోజు బెల్లంపల్లి పట్టణంలోని జామా మసీదులో ప్రెస్ మీట్ పెట్టి ఇట్టి విషయాల గురించి ప్రస్తావించారు. ఈ విషయంపై దేశవ్యాప్తంగా వ్యతిరేకతలు ర్యాలీలు జరుగుతున్నాయని వారు తెలిపారు.ఈ సమావేశంలో మైనార్టీ కోఆప్షన్ మెంబర్ వాజీద్, రెండో వార్డ్ కౌన్సిలర్ అఫ్సర్, మైనార్టీ నాయకులు ఇజాజ్ మరియు సాజిద్ కలీం మరియు ముస్లిం సోదరులు పాల్గొన్నారు