యస్ కె సుభాన్ పాషా రాయల్ పోస్ట్ న్యూస్ బెల్లంపల్లి: రైతు వ్యతిరేక 3 నల్లచట్టాల రద్దు ప్రకటన రైతుల వీరోచిత పోరాటాలకు ఘన విజయమని ఎంసీపీఐ యూ జిల్లా కార్యదర్శి సబ్బని కృష్ణ అన్నారు.మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో MCPIU పార్టీ జిల్లాకార్యదర్శి సబ్బని కృష్ణ మాట్లాడుతూ ఈరోజు దేశ ప్రధాని మోదీ 3 నల్ల చట్టాలను వెనుకకు తీసుకుంటామని చెప్పడం రైతులు గర్వించదగ్గదని ,కేంద్రంలోని BJP ప్రభుత్వం కార్పోరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ వారికి రైతులను తాకట్టుపెట్టే విధంగా,పులినోటికి రైతాంగాన్ని అప్పచెప్పే విధంగా,రైతులను అన్నివిధాల నష్టపరిచే విధంగా 3 నల్లచట్టాలను తీసుకొచ్చి రైతుల మనోభావాలను, ఆత్మవిశ్వాసాన్ని,ఆర్థిక స్తోమతను దెబ్బతీయాలని ఎన్ని కుట్రలు,కుతంత్రాలు చేసిన దేశంలోని రైతాంగమంతా,సమరశీల శక్తులు,వ్యక్తులంతా సంవత్సర కాలం నుండి ఎన్నో కష్టాలను,నష్టాలను ఓర్చుకుంటూ పట్టు విడవకుండా ఢిల్లీ సరిహద్దుల్లో ఎండనక,వాననక,చలనక అలుపెరుగని వీరోచిత పోరాటాలు చేస్తూ 700లకు పైగా రైతులు ప్రాణత్యాగాలు చేసారన్నారు. ఢిల్లీ గద్దెను కదిలించి, వణికించి,విజయాన్ని సాధించిన, ఈపోరాటంలో పాల్గొన్న ప్రతిఒక్క రైతుకు,రైతు కుటుంబానికి పిడికిలెత్తి నినదిస్తూ,విప్లవ జేజేలు తెలియజేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో సబ్బని రాజేంద్రప్రసాద్, కొండ శ్రీనివాస్,ఆరెపల్లి రమేష్,మొగురం సమ్మయ్య,రోహిత్, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు*