బెల్లంపల్లి రాయల్ పోస్ట్ న్యూస్
స్టాఫ్ రిపోర్టర్ : ఎస్ కె. సుభాన్ పాషా బెల్లంపల్లి: ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్రెడ్డి ఐపిఎస్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అరెస్ట్ చేయబడిన నిందితుల వివరాలు వెల్లడించడం జరిగింది.మంచిర్యాలకీ చెందిన అంజిబాబుని Hyundai i-20 కారు లో ఎక్కించుకొని మందమర్రి వైపు తీసుకెళ్లి పిస్టల్స్ చూపించి మావోయిస్టు గణేశ్ దళము లో పని చేస్తామని తమకు ముప్పై లక్షలు రూపాయలు కావాలని చెప్పగా, తను మొదటగా లక్ష యబై రూపాయలు తర్వాత లక్ష రూపాయలు ఇచాడని. తర్వాత ఫిర్యాదు దారునికి ఇంకా బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తుండడం తో తేదీ: 16.11.2021 రోజునా తాల్లగురిజాల పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేసి, ధర్యాప్తు చేస్తున్న క్రమం లో ఈ రోజు ఉదయం నేరస్తులను బెల్లంపల్లి టి జంక్షన్ వద్ద అదేవిధంగా తెలుకుంట్ల బిక్షపతిని అనే మరో నిందితున్ని తన ఇంటి వద్ద పట్టుకొని వారి వద్ద నుండి నేరాలు చేయడానికి ఉపయోగించినవి జప్తు చేయడం జరిగిందన్నారు. ముఠాలో తొమ్మిది మందిని అరెస్టు చేయగా పరారీలో ఒకరు, పాత కేసులో జైలు లో మరొకరు ఉన్నారన్నారు.అరెస్ట్ అయిన నిందితుల వద్ద నుండి నాలుగు పిస్టల్స్, రెండు డమ్మీ రివాల్వర్లు ఒక హ్యుందాయ్ కారు, ఒక స్కూటీ, వాకి టాకీ లు మావోయిస్టు లెటర్ ప్యాడ్, మొబైల్స్ జప్తు చేసుకున్నట్లు సీపీ తెలిపారు.ఇట్టి కేసు నమోదైన వెంటనే, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు, బెల్లంపల్లి త్వరితగతిన స్పందించి ప్రత్యేక బృందాలను ఏర్పర్చి నిందుతులను పట్టుకోవడం లో ఎంతో కృషి చేసిన ఏ.సి.పి మహేశ్, , బెల్లంపల్లి రూరల్ సీఐ జగదీష్, ఎస్.ఐ.తాల్లగురిజాల సమ్మయ్య, నెన్నెల ఎస్ఐ ఎన్.రమాకాంత్, నిందితులను పట్టుకోవడానికి కృషి చేసిన పోలీస్ సిబ్బందిని సీపీ చంద్రశేఖర్ రెడ్డి ప్రసంశించారు.