రాయల్ పోస్ట్ న్యూస్ మంగళగిరి: నా రాజకీయ జీవితంలో ఇంత బాధ ఎప్పుడూ భరించలేదని తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మీడియా సమావేశంలో భావోద్వేగంతో చంద్రబాబు కన్నీరు పెట్టుకున్నారు. ‘‘బూతులు తిట్టినా, ఎన్ని అవమానాలకు గురిచేసినా భరించాం. రెండున్నరేళ్ల నుంచి అన్ని విధాలా అవమానిస్తున్నారు. నిన్న కూడా బీఏసీలో సీఎం అవహేళనగా మాట్లాడారు. నా భార్య ఏరోజూ రాజకీయాల్లోకి రాలేదు. అలాంటిది ఇప్పుడు…’’ అంటూ చంద్రబాబు కన్నీటి పర్యంతమయ్యారు. ఇవాళ ఏకంగా నా భార్యను కించనపరిచేలా దూషించారు. నా జీవితంలో ఇలాంటి పరిణామాలు ఎప్పుడూ చూడలేదు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.