రాయల్ పోస్ట్ న్యూస్భువనగిరి :అహర్నిశలు కష్టపడి నిరుపేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఘనత శ్రీమతి ఇందిరా గాంధీ గారి104వ జయంతి సందర్భంగా 23వ వార్డు ఇందిరానగర్ లో వయోవృద్ధులకు పండ్ల పంపిణీ చేసిన స్థానిక కౌన్సిలర్ పడిగెల రేణుక ప్రదీప్ ముఖ్య అతిథులుగా పాల్గొన్న మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ ప్రమోద్ కుమార్ మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జాంగిర్

భువనగిరి పట్టణ 23వవార్డు ఇందిరానగర్ లో పేద ప్రజల పెన్నిధి భారత దేశ తొలి మహిళా ప్రధాని ఉక్కు మనిషి భారతరత్న స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి 104వ జయంతి సందర్భంగా 23వవార్డు కౌన్సిలర్ పడిగెల రేణుక ప్రదీప్ ఆధ్వర్యంలో వయోవృద్ధుల పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించగా ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ పోత్నక్ ప్రమోద్ కుమార్ గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ గారు పాల్గొని మాట్లాడుతూ ఇందిరాగాంధీ గారు భారతదేశంలో బ్యాంకులను జాతీయకరణ చేసి భూసంస్కరణలు రద్దు చేసి పేద వర్గాలకు పెన్షన్లు ఇండ్లు అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు బర్ల లోనూ గొర్ల లోను ఇస్తూ భారతదేశంలోనే పేదరికం నిర్మూలన కొరకు గరీబీ హటావో నినాదంతో పేద వర్గాల ప్రజలను కాపాడిన అమ్మగా ఇందిరమ్మ ను కొనియాడారు పేద ప్రజల అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడి 20 సూత్రాల పథకం ద్వారా పాఠశాలలను ప్రభుత్వ హాస్పిటల్ అను కాలేజీలను నిరుద్యోగ నిర్మూలన కొరకు ప్రభుత్వ పరంగా అనేక పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేయించి పరిశ్రమలను పెట్టి ఎంతోమంది దళిత బడుగు బలహీన వర్గాల ప్రజలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన ఘనత శ్రీమతి ఇందిరాగాంధీ అని అన్నారు పురుషులతో పాటు మహిళలను కూడా అన్ని రంగాలలో ముందుకు తీసుకురావాలని మహిళల కోసం ఆనాడే ఎన్నో ప్రత్యేక చట్టాలను ఏర్పాటు చేసిన ఘనత శ్రీమతి ఇందిరాగాంధీ అని అన్నారు ఈనాడు భారతదేశం ఎంత అభివృద్ధిలో ముందుకు వెళ్లడానికి కారణం ఆనాడు ఇందిరా గాంధీ గారు ఏర్పాటుచేసిన చట్టాల ద్వారా సంక్షేమ పథకాల ద్వారా ముందుకు వెళుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో లో మహిళలు కిష్టమ్మ ఎల్లమ్మ లక్ష్మమ్మ రాములమ్మ బాలమ్మ మాధవి మన్నెమ్మ సర్వ మా లక్ష్మమ్మ పోచమ్మ లక్ష్మీనారాయణ నరసింహ మల్లయ్య నర్సింగరావు పోచయ్య కిష్టయ్య బాబురావు కాంగ్రెస్ పార్టీ నాయకులు సాల్వర్ ఉపేందర్ కసరబోయిన సాయి బర్రె మహేందర్ మేడి మహేష్ ప్రభాకర్ మల్లేష్ ప్రసాద్ భాస్కర్ నరేష్ తదితరులు పాల్గొనడం జరిగింది