రాయల్ పోస్ట్ న్యూస్ కరీంనగర్ :నేడు మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంతో పాటు నగరంలోని ఇందిరా చౌక్ వద్ద ఇందిరాగాంధీ జయంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించడం జరిగింది.

👉 మొదట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి గారితో పాటు పలువురు నాయకులు హాజరై ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

👉అనంతరం నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో నగరంలోని ఇందిరా చౌక్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు హాజరై ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

👉ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ శ్రీమతి ఇందిరా గాంధీ గారు చిన్నతనం నుండే తన తండ్రి జవహర్లాల్ నెహ్రూ గారి స్ఫూర్తితో ఈ దేశ స్వాతంత్రం కోసం చేసిన పోరాటంలో పాల్గొన్నారని, దేశ స్వాతంత్య్రానంతరం మొదటి మహిళా ప్రధాన మంత్రి గా వారు చేసిన సేవలు, ప్రవేశపెట్టిన పంచవర్ష ప్రణాళికలు, సంక్షేమ పథకాలు, నేటికీ కొనసాగుతున్నాయి అంటే అది వారి ముందు చూపుకు నిదర్శనం అని, నాడు ప్రతిపక్షాల నాయకులు సైతం వారిని గొప్ప నారీమణిగా కీర్తించారంటే అతిశయోక్తి కాదని, అందుకే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమైన మేమందరమూ ఆ వీర వనిత ఆశయ సాధన కోసం కృషి చేస్తామని, వారి అడుగుజాడల్లో నడుస్తా మని ఈ సందర్భంగా వారు చేసిన సేవలను స్మరించుకుంటూ నేడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది అని అన్నారు.

👉ఈ కార్యక్రమాల్లో నాయకులు వైద్యుల అంజన్ కుమార్ ,రహమత్ హుస్సేన్, మడుపు మోహన్ ,వెన్న రాజ మల్లయ్య, ఉప్పరి రవి ,ఎండి తాజ్, పులి అంజనేయులు గౌడ్, కర్ర సత్య ప్రసన్న రెడ్డి, శ్రావణ్ నాయక్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి ,లింగంపల్లి బాబు, కుర్ర పోచయ్య ,గడ్డం విలాస్ రెడ్డి ,మామిడి సత్యనారాయణ రెడ్డి, బొబ్బిలి విక్టర్, రామిడి రాజిరెడ్డి , కొలిపాక సందీప్, షహేన్షా, దండి రవీందర్, ముక్క భాస్కర్ ,పోరండ్ల రమేష్, జి డి రమేష్, ముసళ్ల రామ్ రెడ్డి ,షాబాణ మహమ్మద్, ఎస్డి అజ్మత్,పెద్దేల్లి అంజనేయులు ,గోపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.