రాయల్ పోస్ట్ న్యూస్ షాద్ నగర్,: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని శాసనసభలో ఘోరంగా అవమానించి… ఆయన సతీమణి భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అధికార వైసీపీ నేతల తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా అభిమానుల్లో, టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ చౌరస్తాలో కాసేపటి క్రితం తెలుగుదేశం నాయకులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. వైయస్ జగన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
వైయస్ జగన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ భవిష్యత్తులో ఇంతకు ఇంత అనుభవించక తప్పదని హెచ్చరించారు. వైసీపీ నేతలకు గుణపాఠం ఎలా చెప్పాలో తెలుగుదేశం పార్టీకి తెలుసని, ప్రజలు అన్ని గ్రహిస్తున్నారని, వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఖాయం అని మాజీ ఎంపీపీ వెంకటేశ్వర రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నేతలు గంధం ఆనంద్, రమేష్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు..