రాయల్ పోస్ట్ న్యూస్ మంచిర్యాల : ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలు “సేవా జ్యోతి”లో ఘనంగా నిర్వహించారు మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం బోయపల్లిబోర్డు వేణు నగర్ వద్దగల సేవా జ్యోతి శరణాలయం లో ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు, ముందుగా ఆమే చిత్రపటానికి పూలమాలలు వేసినారు, అనంతరం శ్రీ స్వశక్తి భారత్ సేవా ట్రస్ట్ సేవా జ్యోతి శరణాలయం వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ గజ్జెల్లి శ్రీదేవిమల్లేశం సగర మాట్లాడుతూ ఝాన్సీ లక్ష్మీబాయి ఆశయాలను ఆచరణలో పెడితే.! మన మహిళలు అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పేర్కొన్నారు, సేవా జ్యోతి విద్యార్థి సేవా ప్రముఖ్ సత్యకేశవజిత్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మహనీయుల చరిత్ర లు తెలుసుకుని భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుందాం అని అన్నారు, ఆ మహనీయురాలు వీరోచితంగా పోరాడారు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి ఝాన్సీ కి రాణి అయ్యారు, భారతమాత ముద్దుబిడ్డ గా పేరుగాంచిన మహారాణి వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి ఆశయాలను ఆచరణలో పెడితే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో సేవాజ్యోతి సేవా ప్రముఖ్ మల్లేశం సగర, శరణాలయం నిర్వహకులు స్వప్న సేవిక, లక్ష్మీ, శరణాలయం మానసిక మతిస్థిమితం లేని మహిళలు తదితరులు పాల్గొన్నారు.