రాయల్ పోస్ట్ న్యూస్ మంచిర్యాల :జిల్లా నస్పూర్ కాలనీలోని రాయబారపు నరేష్ అనే వ్యక్తి ఇంట్లో చోరీకి పాల్పడిన నీలాల అవినాష్ అనే నిందితుడిని గురువారం అరెస్ట్ చేసినట్లు మంచిర్యాల ఎసిపి అఖిల్ మహాజన్ తెలిపారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళం పగలగొట్టి నిందితుడు మరో ఇద్దరు మైనర్లతో కలిసి టివి, రెండు ల్యాప్ టాపులు, హోండా స్కూటీ చోరీ చేసినట్లు పేర్కొన్నారు. నిందితుని వద్ద చోరీ సొత్తు స్వాధీనం చేసుకొని రిమాండ్ కు పంపినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎసిపి అఖిల్ మహాజన్ మాట్లాడుతూ ప్రజలు ఒక రోజు కంటే ఎక్కువ రోజులు ఇల్లు విడిచి ఇతర ప్రదేశాలకు వెళ్లాల్సి వస్తే సమీపంలోని పోలీస్ స్టేషన్లలో తెలపాలని సూచించారు.