ఎస్ కె సుభాన్ భాష స్టాఫ్ రిపోర్టర్ (రాయల్ పోస్ట్) బెల్లంపల్లి: ఈ రోజు కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని వాసవి దేవాలయంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతము లను 70 మంది దంపతులచే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి పట్టణ ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రమా సహిత సత్యనారాయణ స్వామి ఆశీస్సులు పొందడం జరిగింది తదనంతరం తీర్థ ప్రసాదం భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ అధ్యక్షులు Nandaiah, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు దయాకర్, ఆదిలాబాద్ జిల్లా మాజీ అధ్యక్షులు విద్యాసాగర్ కార్యదర్శి భాస్కర్ కళ్యాణ మండపం కార్యదర్శి శ్రీధర్ ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు.