రాయల్ పోస్ట్ న్యూస్ తుర్కపల్లి: మండల కేంద్రంలో లంబాడీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసనగా ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చిన, ఎన్ని శిక్షలు విధించినా గిరిజన బాలికల పై కామాంధుల చేతిలో బలైపోతున్నారు. ఎక్కడ చూసినా గిరిజనుల పై దాడి,
గిరిజన బాలికపై అత్యాచారాలు రోజు రోజుకి పెరిగిపోతునే ఉన్నాయి. అగ్రవర్ణ లకు ఒక్క న్యాయం, గిరిజనుల కు ఒక్క న్యాయమా, ఇదెక్కడి ప్రజాస్వామ్యo,పోలీస్ వ్యవస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, మండి పడ్డారు, ఉమ్మడి నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం పరిధిలోని చింతపల్లి మండలం జరఫల్లా తండాకు చెందిన పేద కుటుంబానికి చెందిన గిరిజన అమ్మాయి అమూల్య అలియాస్ రజిత అనే అమ్మాయిని అత్యాచారం చేసి ఇంట్లోనే ఉరితీసిన డేవిడ్ ను వెంటనే పోలీసు అధికారులు ఎన్ కౌంటర్ చేయాలని,లేకుంటే రాష్టం లో అన్ని పోలీస్ స్టేషన్ లను ముట్టడి చేస్తాం,ఇప్పటికైనా పోలీస్ ల పై ఉన్న నమ్మకిని నిలపెట్టుకోవలని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర మరియు జిల్లా నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లంబడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు రంజి నాయక్,యూత్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవి నాయక్,రాష్ట్ర కార్యదర్శి మోహన్ నాయక్,gvs జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ నాయక్,లింగ నాయక్, రమేష్ నాయక్, శేఖర్ నాయక్,LHPS జిల్లా నాయకులు,మండల నాయకులు పాల్గొన్నారు,