రాయల్ పోస్ట్ న్యూస్ హైదరబాద్ : తెలంగాణ రాష్ట్ర యూనివర్సిటీ లలో చదువుతున్న PhD విద్యార్థులు ఫెలోషిప్ లు లేక ఇబ్బందులు పడుతున్నారని, దీంతో పరిశోధనలు పూర్తి స్థాయిలో

జరగడం లేదని ఓయూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి PhD విద్యార్థికి 25000/- లు ఫెలోషిప్ వచ్చేలా, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, తెలంగాణ సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ కొప్పుల ఈశ్వర్ గారిని కలిసి వినతిపత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా అణగారిన వర్గాల విద్యార్థులను ఉన్నత చదువులకు దూరం చేస్తోందని విద్యార్థులు అన్నారు. అందులో భాగంగానే ఫెలోషిప్ ల కోసం నెట్ నిబంధనలు పెట్టారని, అనేక ఫెలోషిప్ లకు నిధులు కెటాయించడం లేదని అన్నారు. చాలా రాష్ట్రాల్లో పరిశోధక విద్యార్థులకు ఫెలోషిప్ లు అందజేస్తున్నారని, పోరాడి సాధించుకున్న తెలంగాణ లో విద్యార్థులకు, రాష్ట్ర ప్రభుత్వం ఫెలోషిప్ లు అందించి పరిశోధన కు సహకరించాలని మంత్రి కి విజ్ఞప్తి చేశారు.

వినతి పత్రం అందజేసిన వారిలో ఓయూ పరిశోధక విద్యార్థులు క్రాంతి రాజ్ , RL. మూర్తి, నాగరాజు, రాహుల్, బాబు, పాల్గొన్నారు.