అరుణ రాయల్ పోస్ట్ న్యూస్ ఆత్మకూర్ ఎం భువనగిరి : CPM జిల్లా మహా సభను జయప్రదం చేయండి ఆత్మకూరు మండలం తుక్కాపురం గ్రామం సిపిఎం పార్టీ కార్యకర్తల సమావేశంలో ద్వితీయ మహాసభలను పోచంపల్లి లో జరిగే 5 6 7 జిల్లా మహాసభలు జయప్రదం చేయాలని మండల కార్యదర్శి వేముల బిక్షం కోరారు ఈ సందర్భంగా తుక్కాపురం గ్రామంలో ఇంటింటికి సిపిఎం కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా మహాసభల కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం వరి కొనుగోలుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తి తో ఉన్నారని అన్నారు. అదేవిధంగా గ్రామంలో బస్సు సౌకర్యం కల్పించాలి . ఈ కార్యక్రమంలో సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శి ఎరుకల పాపయ్య మండల కమిటీ సభ్యులు మల్లెల శ్రీశైలం భాష బోయిన పెద్ద బుగ్గయ్య గాదె ఎల్ ఎస్ తదితరులు పాల్గొన్నారు.