వర్ష సూచన ఉంది – ధాన్యం జాగ్రత్త

డా. రాజేశ్వర్ నాయక్, ప్రోగ్రాం కోఆర్డినేటర్, కృషి విజ్ఞాన కేంద్రం, బెల్లంపల్లి.

రాయల్ పోస్ట్ న్యూస్ మంచిర్యాల: వర్షాకాలం మొదలైనప్పటి నుండి ఇప్పటివరకు మంచిర్యాల జిల్లాలో దాదాపు 1061 మిల్లీ మీటర్ల వర్షపాతం కురవగా కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 1459 మిల్లీమీటర్ల వర్షం కురవడం జరిగింది. గడిచిన మూడు రోజులలో రెండు జిల్లాల్లో కూడా అతి తేలిక పాటి వర్షాలు అక్కడక్కడ కొన్ని కొన్ని మండలాల్లో మోస్తారు వర్షం నమోదు చేయడం జరిగింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి అందుతున్న సమాచారం ప్రకారం మంచిర్యాల మరియు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రాబోయే ఐదు రోజుల్లో తేలికపాటి వర్షాలు ఉండగా కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. వరి పంట కోత దశలో ఉన్నందున రైతులు తగు జాగ్రత్తలు పాటించడం ద్వారా ఆకాల వర్షాల నుండి పంటను కాపాడుకోవచ్చు.

రాబోయే ఐదు రోజులలో వర్షసూచన ఉన్నందున రైతులు వరి కోతలను తాత్కాలికంగా వాయిదా వేసుకుంటే మంచిది.

ఒకవేళ వరి కోయాల్సి వస్తే వెంటనే ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించి టార్పాలిన్ కప్పాలి.

వర్షసూచన ఉన్నందున మనుషులతో వరి కోయడం కంటే కంబైన్డ్ హార్వెస్టర్ ద్వారా వరి కోతలు చేసుకోవడం ఉత్తమం.

ఒకవేళ ధాన్యం తడిసినట్లైతే ఐదు శాతం ఉప్పు ద్రావణాన్ని ధాన్యం పై పిచికారి చేయాలి.