రైతన్న కోసం మహదర్నా లో బోడుప్పల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు…

మేడ్చల్ జిల్లా, (రాయల్ పోస్ట్ న్యూస్) నవంబర్ 18 మేడిపల్లి కేంద్ర ప్రభుత్వం వరిధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని రైతు వ్యతిరేక విదానాలకు నిరసనగా,తెలంగాణ రైతులు పండించే పంటకు మద్దతు ధర కల్పిస్తూ ప్రతి ధాన్యపు గింజను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని రాష్ర్ట ప్రభుత్వం రైతులకు మద్దతుగా ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన మహదర్నాకు ఘట్కేసర్ మాజి జడ్పీటీసీ,బొడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి,బోడుప్పల్ కార్పొరేషన్ మేయర్ సామల బుచ్చిరెడ్డి ఆద్వర్యంలో బోడుప్పల్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలిగా భయలుదేరి అంబేద్కర్ విగ్రహనికి పూలమాల వేసి టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో చలో ఇందిరా పార్క్ ధర్నాకు భయలుదేరడం జరిగింది ఈ కార్యక్రమంలో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పోరేటర్ లు,కోఆప్షన్ సభ్యులు తెరసపార్టీ సీనియర్
నాయకులు,అభిమానులు,తదితరులు పాల్గొన్నారు.