భువనగిరి పట్టణ రోడ్డు విస్తీర్ణణ బాధితుల కొరకు జిల్లా కలెక్టర్ గారితో సమావేశమైన కాంగ్రెస్ కౌన్సిలర్లు బృందం

రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి: స్థానిక భువనగిరి పట్టణ ఆర్డీవో కార్యాలయంలో భువనగిరి పట్టణ మెయిన్ రోడ్డు ఇరువైపులా రోడ్డు విస్తరణలో మడిగెల,ఇండ్లు, డబ్బాలు కోల్పోతున్న బాధితుల కొరకు కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పోత్నక్ ప్రమోద్ కుమార్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కౌన్సిలర్లు బృందం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ శ్రీమతి ప్రమేలా సత్పతి గారితో సమావేశంలో పాల్గొని బాధితుల సమస్యలు కలెక్టర్ గారికి తెలియజేస్తూ అంశాల వారీగా డిమాండ్లు
:-40 ఫీట్లుల మీద 50 పీట్లుల మీద పూర్తిగా నష్టపోతున్న బాధితులకు నష్ట పరిహారం ఒక్క గజంకు ఒక లక్ష రూపాయల చొప్పున ఇవ్వాలని మరియు పూర్తిగా స్థలం కోల్పోతున్న బాధితులకు 2013 చట్టం ప్రకారం మాడిగెల కోల్పోతున్న వారికి మాడిగెలు,ఇండ్లు కోల్పోతున్న వారికి ఇండ్లు ఇవ్వాలి అలాగే ఒక యూనిట్ ఏర్పాటు చేసుకునే కొరకు లక్ష రూపాయల చొప్పున ఇవ్వాలని అలాగే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి,,
:- రోడ్డు విస్తరణలో 40 పీట్లులకు,50 పీట్లులకు మీద మున్సిపాల్ నుండి పర్మిషన్ లు కలిగి ఉండి మడిగెలు,ఇండ్లు కూలిపోతున్న భవనాలకు స్థలానికి నష్టపరిహారం చెల్లించాలి,,,
:-50 ఫీట్లు మీద యజమాన్యలకు మెట్లు ర్యాంపులు ఐదు పీట్లు వరకూ నిర్మించుకునే విధంగా అనుమతులు ఇవ్వాలి
:- మెయిన్ రోడ్ ఇరువైపులా డబ్బా కార్మికులకు తోపుడుబండ్ల కార్మికులకు గత 30 సంవత్సరాల నుండి దాని ద్వారా జీవనోపాధి పొందుతున్న వారిని గుర్తించి అందరికీ జూనియర్ కళాశాల ఆవరణలో మరియు పాత మున్సిపల్ కార్యాలయం స్థలంలో స్ట్రీట్ వెండర్స్ ఏర్పాటు చేసి పర్మినెంట్ గా పునరావాసం కల్పించాలి

జిల్లా కలెక్టర్ గారు స్పందించి మాట్లాడుతూ రోడ్డు విస్తీర్ణ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవని,బాధితుల పైన ఎలాంటి ఒత్తిడిలు తీసుకురాముఅని ఎవరికి వాళ్లు స్వచ్ఛందంగా కోలగోట్టుకోవడానికి బాధితుల అవసరం రీత్యా సమయం ఇస్తామని,నష్టపరిహార విషయంలో మున్సిపల్ కమిషనర్ గారికి ఆదేశాలు ఇస్తామని,డబ్బాల కార్మికులకు నిజంగా డబ్బా పైన జీవనోపాధి పొందుతున్న వారికి ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటాం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఈకార్యక్రమంలో మున్సిపల్ కాంగ్రెస్ కౌన్సిలర్లు పడిగెల రేణుక ప్రదీప్, ఈరపాక నరసింహ, వడిచర్ల లక్ష్మి కృష్ణ యాదవ్ కైరంకొండ వెంకటేష్ కోళ్ల దుర్గ భవాని గంగాధర్ ఆర్డిఓ కార్యాలయం సూపర్డెంట్ మందాడి ఉపేందర్ రెడ్డి, బాధిత సంఘ నాయకులు పెరుమండ్ల వేణు మంచికంటి కృష్ణమూర్తి నువ్వుల నరసింహ సరగడ కరణ్ పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు డాన్ బాబా తదితరులు పాల్గొనడం జరిగింది