రాయల్ పోస్ట్ న్యూస్ రంగారెడ్డి: రాజేంద్రనగర్.. సర్కిల్ మైలార్ దేవ్ పల్లి పొలిస్టేషన్ పరిధిలో మహిళ ధారుణ హత్య.బుద్వేల్ రైల్వేస్టేషన్ బస్తీలో గత 40, ఏండ్లుగా నివాసముంటున్న మామిల్ల జంగయ్య (వృత్తిరీత్యా పాల వ్యాపారి) మీనా భార్యాభర్తలు వీరికి ముగ్గురు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు. రోజు మద్యం తాగి ఇంటికి వస్తున్న భర్తను భార్య మందలించడంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో తాగిన మత్తులో క్షణికావేశంలో అక్కడే ఉన్న పార తీసుకుని భార్య తలపై మోదడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. స్థానికుల సమాచారం మేరకు మైలార్దేవ్పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.