రాయల్ పోస్ట్ న్యూస్ హైదరబాద్:హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్ నుండి వ్యవసాయ కమిషనరేట్ వరకు టీపిసిసి తలపెట్టిన నిరసన ప్రదర్శనలో పాల్గొన్న యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ద్రోహం చేస్తూ దొంగ నిరసనలు చేస్తున్నాయని ప్రభుత్వం వెంటనే స్పందించి వరి కొనుగోలు చేయకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంతకన్నా పెద్ద ఎత్తున నిరసన కార్య్రమాలు చేపడతాం అని అందులో భాగంగానే జిల్లాలో కూడా నిరసన కార్యక్రమంలో ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారితో పాటుగా భువనగిరి నియోజకవర్గం నుండి హాజరైన వారిలో మండల అధ్యక్షులు కోట పెద్ద స్వామి, పాక మల్లేష్ యాదవ్,
సత్తిరెడ్డి, పొట్టోల శ్యామ్ గౌడ్, పట్టణ అధ్యక్షులు బిసి కుంట్ల సత్యనారాయణ, రమేష్ గౌడ్, కిసాన్ సెల్ అధ్యక్షులు మర్రి నర్సింహారెడ్డి, ఎంపీపీ నూతి రమేష్ రాజు గారు ఇంకా జిల్లా కాంగ్రెస్ నాయకులు జగన్ రెడ్డి, మోహన్ రెడ్డి, కాసుల ఎంకన్న, ఆదినారాయణ, మజార్, నిఖిల్ ఇతర కార్యకర్తలు హాజరయ్యారు.*