ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ సీఎం కేసీఆర్ చేస్తున్న దీక్షకు మద్దతుగా

రాయల్ పోస్ట్ న్యూస్ ఉ యు హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల నుండి టిఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ.బాలు ఆధ్వర్యంలో విద్యార్థులు బైక్ ర్యాలీతో భారీగా ఇందిరా పార్కు బయలుదేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులను కించపరిచే విధంగా నల్ల చట్టాలను తీసుకువచ్చారు బిజెపి పార్టీ ఏ రోజు కూడా రైతులకు అండగా నిలవలేదు. రాష్ట్రంలో వరి ధాన్యం కొనక పోతే ఉద్యమిస్తాం అంటూ హెచ్చరించారు..కేంద్రంలో భాజపా విధానాలపై విద్యార్థులు గా ఉద్యమిస్తాము అంటూ బాలు హెచ్చరించారు.