రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి:ఈరోజు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా కమిటీ సమావేశం భువనగిరి పట్టణంలో సుందరయ్య భవనంలో అవ్వారి రామేశ్వరి గారి అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి బట్టుపల్లి అనురాధ గారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల తో పేద మహిళల పై తీవ్ర ప్రభావం పడుతుందని అన్నారు నిత్యావసర సరుకులు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల భారంతో మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఐద్వా సంఘం ఆధ్వర్యంలో పోరాడి నిర్భయ ఆస్తి హక్కు చట్టం తెచ్చుకున్నాం అన్నారు ఇటీవల చిన్నారులపై అత్యాచారాలు హత్యలు మహిళలపై వేధింపుల సమస్యలు ఎక్కువ అయ్యాయి అన్నారు వీటికి మూలం అయినటువంటి మద్యం గంజాయి డ్రగ్స్ పోర్న్ సైట్ లను నిషేధించాలని ప్రభుత్వాలు తగిన చర్యలను చేపట్టాలని అన్నారు ఈ సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శి దాసరి, జిల్లా ఉపాధ్యక్షురాలు కొండమడుగు నాగమణి, జిల్లా కోశాధికారి కల్లూరు నాగమణి, జిల్లా కమిటీ సభ్యురాలు దండు స్వరూప తదితరులు పాల్గొన్నారు.