నేటి ధర్నాను విజయవంతం చేయండి
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్చెరు

రాయల్ పోస్ట్ న్యూస్ పటాన్చెరు:

తెలంగాణలో పండిస్తున్న వరి ధాన్యాన్ని కొనుగోలు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గురువారం ఉదయం 10 గంటలకు ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని అన్ని స్థాయిల ప్రజా ప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు గురువారం ఉదయం 9 గంటల లోపు రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని లక్ష్మి గార్డెన్స్ కు చేరుకోవాలని తెలిపారు. ర్యాలీగా బయలుదేరి ధర్నాకు హాజరు కాబోతున్నట్లు తెలిపారు.