నిమ్మల నర్సింహా కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి…
– AITUC

రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి:భువనగిరి టూ ఘట్కేసర్ రూట్ ఆటో యూనియన్ డ్రైవర్ నిమ్మల నర్సింహా (55) కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి MD. ఇమ్రాన్ డిమాండ్ చేశారు.
ఈ రోజు ఉదయం 10.30 గంటలకు భువనగిరి పట్టణం 11వ వార్డ్ బొమ్మయిపల్లికి చెందిన నిమ్మల నరసింహ ఆకస్మిక మృతి చెందారు.ఈ సందర్బంగా కొత్త బస్టాండ్ ఎదురుగా ఆటో స్టాండ్ వద్ద నిమ్మల నరసింహ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.. అనంతరం బొమ్మయిపల్ల కి వెళ్లి ఆయన పార్ధివ దేహం పై పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు. ఈ సందర్బంగా MD.ఇమ్రాన్ మాట్లాడుతూ నిరంతర కష్ట జీవి,AITUC యూనియన్ నిర్ణయాలకు కట్టుబడి ఉన్నా కార్యకర్తగా,ఆటో డ్రైవర్ల అభిమానాన్ని చూరగొన్నా నర్సింహా జ్ఞాపకాలు మరువలేనివని, నర్సింహా మరణం AITUC మరియు ఆటో యూనియన్ ఉద్యమానికి తీరని లోటని అన్నారు…
నిన్న సాయంత్రం నిమ్మల నర్సింహా తండ్రి నిమ్మల రాజయ్య (75) అనారోగ్యంతో మృతి చెందారు.. ఒకే కుటుంబంలో తండ్రి కొడుకులు ఇద్దరూ చనిపోవడం చాలా బాధాకరం

జోహర్ నిమ్మల నర్సింహా గారికి✊️✊️

నిమ్మల నరసింహ మృతికి AITUC యాదాద్రి భువనగిరి జిల్లా సమితి ప్రగాఢ సంతాపం తెలుపుతుంది.
నర్సింహాకు నివాళులు అర్పించిన వారిలో ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు గానబోయిన వెంకటేష్ (రాణా), నాయకులు బాబు,షరీఫ్,ఫయాజ్,రాజు, బాలకృష్ణ,ఉపేందర్, అశోక్,సురేష్,శ్రీశైలం, పెంటయ్య,భిక్షు నాయక్, ఇర్య నాయక్, భాస్కర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
ఇట్లు
MD. ఇమ్రాన్, AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి, యాదాద్రి భువనగిరి.