విద్యార్థుల్లో మేధాశక్తిని పెంపొందించేందుకు చదరంగం ఎంతో అవసరం

రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి:విద్యార్థుల్లో మేధాశక్తిని పెంపొందించేందుకు చదరంగం పోటీలు దోహద పడతాయని అదనపు కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. పట్టణంలోని వైఎస్సార్ గార్డెన్ లో గత రెండు రోజుల క్రితం, రోటరీ క్లబ్ ఆఫ్ భువనగిరి వారి అధ్వర్యంలో 13వ తేదీన జరిగిన్న, 29వ తాటేపల్లి గోపాలకృష్ణ మెమోరియల్, ఓపెన్ చెస్‌ పోటీలో గెలుపొందిన, విజేతలకు బహుమతుల పంపిణీ కార్యక్రమానికి సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విద్యార్థుల్లో మేధాశక్తిని పెంపొందించేందుకు చదరంగం పోటీలు దోహద పడతాయన్నారు. క్రీడలలో గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలన్నారు. క్రీడల్లో క్రీడాస్ఫూర్తి ఎంతో అవసరమన్నారు. విద్యార్థులు రోజు వారి సమయంలో కొంత క్రీడలకు కేటాయించాలన్నారు. క్రీడల వల్ల శారీరక, మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని, తద్వారా ఒత్తిళ్లను అధిగమించగలరన్నారు. చిన్నప్పటినుంచి క్రీడల్లో పాల్గొనేలా విద్యార్థులను తయారు చేయాలన్నారు. అనంతరం వివిధ విభాగాల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు. పట్టణంలోని సాధన స్కూల్ కి చెందిన ఈశ్వర్ కి మొదటి బహుమతి, శ్రీసాయి ప్రశాంతి స్కూల్ కి చెందిన టీ. వైష్ణవి కి రెండవ బహుమతి, సాధించారు. ఈసందర్భంగా వారిని అదనపు కలెక్టర్ అభినందించారు. ఇటువంటి పోటీలు నిర్వహించిన రోటరీ క్లబ్ ఆఫ్ భువనగిరి అధ్యక్షులు లక్ష్మణ్, మరియు సభ్యులు, నిర్వాహకులను ఈసందర్భంగా ఆయన అభినందించారు..ఈకార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు, శెట్టి బాలయ్య, దిడ్డి బాలజీ, బుచ్చిరెడ్డి, నర్సింగరావు, హరికిషన్,నరసింహ,నాగరాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు