స్పిరిట్ ఆఫ్ హ్యుమానిటీ అవార్డును అందుకున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

( రాయల్ పోస్ట్ వాయిస్) ఖైరతాబాద్: ఎల్బీనగర్ విశ్వ గురు అంతర్జాతీయ రికార్డ్స్ సంస్థ ద్వారా స్పిరిట్ ఆఫ్ హ్యుమానిటీ అవార్డును గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేతుల మీదుగా అందుకున్న ఎల్బీనగర్ శాసనసభ్యులు శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి. మంగళవారం ఉదయం రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అందజేశారు. కరోనా లాక్ డౌన్ సమయంలో హైదరాబాద్ నగరంలో గత సంవత్సరం వచ్చిన అకాల వర్షాల కారణంగా వచ్చిన వరదల సమయంలో రాజకీయాలకు అతీతంగా, ప్రజలకు, అంధులు, వికలాంగులు, అనాథలకు అందించిన అపారమైన సేవలకు గాను గత అనేక సంవత్సరాలుగా నిర్విరామంగా సేవా కార్యక్రమాలలో పాలుపంచుకుంటున్నటువంటి గొప్ప సేవలను గుర్తించిన విశ్వ గురు అంతర్జాతీయ రికార్డ్స్ సంస్థ సుధీర్ రెడ్డి అంతర్జాతీయ స్పిరిట్ ఆఫ్ హ్యుమానిటీ అవార్డును ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు, సీఈవో సత్యవోలు రాంబాబు, డైరెక్టర్ పూజిత, సోషల్ మీడియా ఇంచార్జ్ రమాకాంత్, ఎం ఆర్ డి సి ఎల్ చైర్మన్ ఓఎస్డి పగడాల శివప్రసాద్, కృష్ణ సాగర్  పాల్గొన్నారు.