సోషల్ మీడియాలో ఎంపీ వెంకటేష్ నేత పై తప్పుడు ప్రచారం చేస్తే ఖబడ్దార్ ……..సాయిని ప్రసాద్

రాయల్ పోస్ట్ న్యూస్ సికింద్రాబాద్:, నవంబర్ 16 నేటి మన దేశమ్ ప్రతినిధి…. పెద్దపెల్లి నియోజకవర్గం ఎంపీ వెంకటేష్ నేత పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరగడాన్ని తెలంగాణ నేతకాని మహర్ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సాయిని ప్రసాద్ నేత తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద తెలంగాణ నేతకాని మహర్ విద్యార్థి సంఘం నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ నేతలు భూకబ్జాలు చేస్తూ నా పేరు వాడుకుంటారు అంటూ చేస్తున్న కార్యక్రమాలు బందు చేయాలని లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని తనదైన శైలిలో వెంకటేష్ నేత స్పందించారు. ఈ వాక్యాలను బిజెపి నాయకులు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు వెంకటేష్ నేతకు రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న ప్రజాదరణ చూసి తట్టుకోలేని బిజెపి నాయకులు చేస్తున్న వారి ప్రయత్నాలను మానుకోవాలని ఇలాంటి చిల్లర కార్యక్రమాలు చేయకూడదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు సాయిని ప్రసాద్ నేత,రాష్ట్ర నాయకులు కమెర రామకృష్ణ , దుర్గం వినోద్ కుమార్ , గోమస రాజబాపు , సాయికుమార్ శివ కార్తిక్ తో పాటు పలువురు పాల్గొన్నారు.