రేషన్ బియ్యం పట్టివేత

రాయల్ పోస్ట్ న్యూస్ మంచిర్యాల: అక్రమంగా తరలించడానికి సిద్ధంగా ఉన్న రేషన్ బియ్యాన్ని రవీంద్రఖని రైల్వేస్టేషన్ లో సంబంధిత అధికారులు మంగళవారం పట్టుకున్నారు.నమ్మదగ్గ సమాచారంతో సంయుక్త అధికారి మధుసూదన్ నాయక్ ఆదేశాల మేరకు 10 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీన పరుచుకున్నట్లు అధికారులు తెలిపారు.పేదలకు అందాల్సిన పిడిఎస్ బియ్యాన్ని ప్రక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. ఈ దాడుల్లో డిసిఎస్వో ప్రేమ్ కుమార్, డిఎం గోపాల్,గిర్ధవార్లు నవిత్,రవికీషార్,విఆర్ఏ భాగ్యలక్ష్మి, రాజు పాల్గొన్నారు