రాయల్ పోస్ట్ న్యూస్ సైదాబాద్ :రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వాహన శ్రేణిపై టీఆరెస్ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ జలమండలి ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు చవ్వా సతీష్ కుమార్ అన్నారు. సైదాబాద్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ బండి సంజయ్ పై దాడులు పూర్తిగా కేసీఆర్ కనుసన్నల్లోనే జరుగగాయని తెలిపారు.టీఆరెస్ వైఫల్యాల పై రైతులు, ప్రజలు, బీజేపీ కార్యకర్తలు తిరగబడే రోజు ఆసన్నమైందని చెప్పారు.రైతులకు చేసిన మోసాలకు కేసీఆర్ సర్కారు తగిన మూల్యం చెల్లించే రోజు ఆసన్నమైందని హెచ్చరించారు.పోలీసులు కేసీఆర్ సర్కారుకు భయపడి చేష్టలుడిగి చూస్తున్నాని ఆరోపించారు.