రాయల్ పోస్ట్ న్యూస్ మల్లాపూర్ హైదరాబాద్ :వైష్ణవి దేవి బార్ లో మద్యం సేవించడానికి వెళ్లిన ఇద్దరు స్నేహితులు తినడానికి ఆహారం ఆర్డర్ ఇవ్వగా తినే ఆహారంలో జిల్ల పురుగు కనిపించగా ఖంగుతిన్న కస్టమర్లు,
కస్టమర్లు బార్ సిబ్బందినీ ప్రశ్నించగా నిర్లక్ష్యపు సమాధానం చెప్పారు. కస్టమర్ల పై మాటల యుద్ధానికి దిగారు బార్ సిబ్బంది,వైష్ణవి దేవి బార్ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రాత్రి 2:00 వరకు నడుపుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అర్ధరాత్రి దాటాక కూడా బార్ నడిపిస్తున్నారని పలుమార్లు స్థానికంగా ఉండే పోలీస్ స్టేషన్ మరియు ఉప్పల్ ఎక్సైజ్ ఆఫీస్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా కూడా లాభం లేకుండా పోయింది. స్థానికంగా ఉండే వారు పలుమార్లు బార్ ఓపెన్ ఉందని ఫొటోస్ వీడియోస్ ఎక్సైజ్ సీఐ పంపించిన కూడా చర్యలు తీసుకోక పోవడంలో ఆంతర్యమేమిటని స్థానికులకు అర్థం కావడం లేదు